Top News

PHD In Osmaniya | గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న డాక్టర్ నారెడ్డి స్వప్న

కామారెడ్డి జిల్లా యువతికి ఉస్మానియాలో పీహెచ్.డీ

గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న డాక్టర్ నారెడ్డి స్వప్న

కామారెడ్డి, సెప్టెంబర్ 08: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన డాక్టర్ నారెడ్డి స్వప్న ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో పీహెచ్.డీ పట్టా అందుకున్నారు.

నారెడ్డి లక్ష్మారెడ్డి, రాధ దంపతుల కుమార్తె అయిన స్వప్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఎస్. కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో "In vitro propagation, phytochemical analysis and molecular characterization of Curcuma amada Roxb" అనే అంశంపై పరిశోధన చేశారు.

ఆమె పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. హైదరాబాద్ లో జరిగిన 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా పీహెచ్.డీ పట్టాను అందుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధుమిత్రులు, విద్యావేత్తలు డాక్టర్ స్వప్నను అభినందించారు. పల్లెటూరు నుంచి వచ్చి ఉన్నత విద్యలో రాణించడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.



Post a Comment

أحدث أقدم