Attack on Saudi Airport | కామారెడ్డి యువకుడికి తీవ్ర గాయాలు

సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి - కామారెడ్డి యువకుడికి తీవ్ర గాయాలు

కామారెడ్డి / రియాద్, అక్టోబర్ 12:

సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపినట్లు చెబుతున్న క్షిపణి, డ్రోన్ దాడిలో 11 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారిలో కామారెడ్డికి చెందిన యువకుడు ఉన్నాడు. 

బాధితుడు ఎవరు?

షేక్ సయిద్ (36) - సైలాని బాబా కాలనీ / టీచర్స్ కాలనీ, కామారెడ్డి. గత 10-12 ఏళ్లుగా సౌదీలో ఉంటూ గత కొన్నేళ్లుగా రియాద్ లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్టార్‌బక్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

నిన్న సాయంత్రం సుమారు 5 గంటలకు (IST) డ్యూటీలో ఉండగా ఈ దాడి జరిగినట్లు బంధువులు తెలిపారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన సయిద్ ప్రస్తుతం రియాద్ లోని కింగ్ ఫహద్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

సౌదీలో ఉన్న బంధువులు ఈ విషయాన్ని కామారెడ్డిలోని కుటుంబానికి తెలియజేశారు. కుటుంబం ఆందోళనలో ఉంది.

Post a Comment

أحدث أقدم