Childrens Day | ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

అంతర్జాతీయ బాలికల దినోత్సవం - గౌరారంలో ఘనంగా వేడుకలు

ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ

పిట్లం, అక్టోబర్ 11:

అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని పిట్లం మండలం గౌరారం గ్రామ పంచాయతీలో ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు పెన్నులు, నోట్ బుక్స్ ను సర్పంచ్ లోకినేని హన్మంత్ రావుతో కలిసి ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త అయ్యాల సంతోష్ అందజేశారు.

ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ... ఒక దేశం ఎదగాలంటే బాలికలు విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా ఎదగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారన్నారు. ప్రతి సమాజానికి బాలికలే పునాది అని, బాలికలకు హక్కులు, సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్య భద్రత, సమానత్వం కల్పించాలన్నారు. వారు ఎదుర్కొంటున్న వివక్షను తొలగించి, తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలని, బాల్యవివాహాలు, వివక్ష, వేధింపులను అరికట్టాలని పిలుపునిచ్చారు. బాలికలను ప్రోత్సహిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో ముందుంటారన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ లోకినేని హన్మంత్ రావు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్, మాజీ VSS చైర్మన్ జూపాలి శంకర్, వార్డు మెంబర్ గొల్ల మారుతీ, పెరుమాళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم