ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలి
కాంగ్రెస్ అధికార ప్రతినిధి నల్లాల వినయ్ కుమార్ పిలుపు
కామారెడ్డి: ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్ కి తెలంగాణ ప్రజలందరూ అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నల్లాల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆహార పదార్థాలను వృథా చేయకూడదని, అలాగే విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని నల్లాల వినయ్ కుమార్ వెల్లడించారు.

إرسال تعليق