Bhetala Swamy Jatara | భేతాళ స్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తి

👉23న ఎద్దుల బండి జాతరతో  ప్రారంభం

👉24న కుస్తీ పోటీలు

👉25న జాతర ముగింపు

👉మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాల్ రాజ్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న భేతాళ స్వామి జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల  విజయ బాలరాజ్ తెలిపారు. (జాతర వీడియో 👇👇)


               ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణం, పుర శ్రేయస్సు, సుభిక్షం కోసం ఈ జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని, ఈనెల 23న ఎద్దుల బండి జాతరతో ప్రారంభమై, 24 కుస్తీ పోటీలు నిర్వహించడంతో ఈనెల 25న జాతర ముగింపు కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.

ఈ జాతరకు రాష్ట్రంతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,

జాతర సందర్భంగా మున్సిపాలిటీ తరఫున పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వెలుగు, భద్రత వంటి అన్ని సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post