BJP Support | బాన్సువాడలో ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంఘీభావం

 [ఫోటో: బాన్సువాడలో ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు]

కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మంగళవారం స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్మికుల ధర్నా శిబిరం వద్దకు చేరుకుని బీజేపీ నేతలు సమ్మెకు మద్దతు ప్రకటించారు.

బీజేపీ ఎన్నారై నాయకులు కోనేరు శశాంక్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, టౌన్ మండల అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, పొతంగల్ మాజీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రకాష్ పాటిల్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, టౌన్ ఉపాధ్యక్షులు గుడుగుట్ల అనిల్, కార్యకర్తలు గోపి, బల్వీర్ సింగ్, నాగరాజు తదితరులు కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లు న్యాయమైనవని, వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు దిగడం సరికాదని విమర్శించారు.

కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ శ్రేణులు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post