ఎమ్మెల్యే పోచారం చేతుల మీదుగా అంబలి కేంద్రం ప్రారంభం

-40 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్న 'నాగులగామ' కుటుంబం

-పేదల ప్రశంసలందుకుంటున్న వెంకన్న

(తెలంగాణ డైలీ న్యూస్-బాన్సువాడ)

          రహదారి వెంబడి వెళ్లే బాటసారులు, పట్టణంలోని వ్యాపారులు, పేదల సౌకర్యార్థం గత 40 ఏళ్లుగా వేసవి కాలంలో నిర్వహించే అంబలి కేంద్రం-చలివేంద్రాన్ని తెలంగాణ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

            కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఉమ్మడిజిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, కీర్తిశేషులు నాగులగామ గిర్మయ్య గుప్తా గత 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సామాజిక కార్యక్రమాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు సైతం కొనసాగిస్తున్నారు. గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నాగులగామ వెంకన్న గుప్తా నిర్వహిస్తున్న అంబలి కేంద్రం ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.

ఎండాకాలంలో జొన్న అంబలి తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుందని, ఎండ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుందని ఎమ్మెల్యే పోచారం తెలిపారు.   ఇది మన సాంప్రదాయ పానీయమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని, సుమారు మూడు నెలల పాటు కొనసాగుతుందని, ప్రజలు సద్వినియోగించుకోవాలని ఈ సందర్బంగా వెంకన్న కోరారు.


కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాస్, గురువినయ్ కుమార్, నార్ల సురేష్, పిట్ల శ్రీధర్, హకీమ్, నార్ల రవీందర్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post