అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి

 

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

          అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు.   ఈరోజు బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు సమావేశ మై ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్ గ్రామ సెక్రెటరీ ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు.

   అంబేద్కర్ విగ్రహానికి కలర్స్ పూలమాలలతో విగ్రహ పరిసరలో అలంకరణ చేయాలని ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్ నర్సింలు, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.  కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని సర్పంచ్ సెక్రెటరీ, ప్రతి గ్రామంలో ఉన్న అంబేద్కర్ సంఘం దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు

 ఈ కార్యక్రమంలో కొత్త బాద్ మాజీ సర్పంచ్ సాయిలు బాన్సువాడ డివిజన్  ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు గైని రవి డివిజన్ ముఖ్య సలహాదారు వాగ్మారే మారుతీ డివిజన్ అంబేద్కర్ సంఘ నాయకులు మన్నె నాగభూషణం కమ్మరి గంగారం పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post