•మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావుకు పోచారం శ్రీనివాసరెడ్డి నివాళి

•కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పరామర్శ

తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

నాదెండ్ల భాస్కర్‌రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం వారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నాదెండ్ల భాస్కర్‌రావు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి తీరనిలోటు అని అన్నారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.





1 Comments

Post a Comment

Previous Post Next Post