Middlemen Cheating Paddy Farmers | ధాన్యం కొనుగోలులో దళారుల దోపిడీ

 వీడియో 👇👇


#ధాన్యం కొనుగోలులో దళారుల మోసం
#తూకంలో రైతులకు అన్యాయం
#మోసాన్ని నిరూపించిన రైతులు
#దళారిపై ఆగ్రహం

తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, కామారెడ్డి:

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా దళారులు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తూకంలో మోసం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకంలో మోసం చేస్తున్నారు. 45 క్వింటాళ్లకు 40 క్వింటాళ్లు మాత్రమే లెక్కగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి క్వింటాకు 5 కిలోల వరకు తగ్గిస్తూ, బస్తాకు 2-3 కిలోలు తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పూర్తిగా అందడం లేదు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో దళారులు ఇప్పటికే ధాన్యం కొనుగోలను ప్రారంభించారు. 
గుర్జాల్ తాండలో ధాన్యం దళారుల దోపిడీ

గాంధారి మండలం గుర్జాల్ తాండలో ధాన్యం కొనుగోలు పేరిట దళారుల దోపిడీ కొనసాగుతోంది. ఇందల్ అనే వ్యక్తితో పాటు మరో 12 మంది దళారులు గ్రామంలో రైతుల నుంచి వడ్లను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. 

ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,300* ఉన్నప్పటికీ, దళారులు మాత్రం రూ. 2,000 వరకే చెల్లిస్తున్నారు. పైగా ‘తరుగు’ పేరుతో క్వింటాకు 5 కిలోలు, బస్తాకు 2-3 కిలోలు కోత విధిస్తున్నారు. 45 క్వింటాళ్ల ధాన్యానికి 40 క్వింటాళ్లు మాత్రమే లెక్క కడుతున్నారు. దీంతో రైతులు దళారీ ఇందల్ ను నిలాదీశారు.  ఇకపై మోసం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

కాగా అకాల వర్షాల భయంతో పంట దెబ్బతింటుందనే ఆందోళనతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడమే దీనికి ప్రధాన కారణమని రైతులు వాపోతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి దళారులను నియంత్రించాలని కోరుతున్నారు.

అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post