Paddy Purchasing Problems | ధాన్యం కొనుగోలు సమస్యలపై వినతి

ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన రైతులు

తెలంగాణ డైలీ న్యూస్,  నిజామాబాద్ రూరల్ : 

సిరికొండ మండలంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై మండల రైతులు తహసిల్దార్ రవీందర్ రావు, సొసైటీ సీఈవోలకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో అమలైన విధంగా ఈసారి కూడా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని, ఐకెపితో పాటు ఐడీసీఎంఎస్, పిఎసిఎస్ కేంద్రాలను కూడా మంజూరు చేయాలని కోరారు. అలాగే స్థానిక రైస్ మిల్లులకు తక్షణమే అలాట్మెంట్ ఇచ్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.పంట కోత పూర్తై నెల గడిచినా ధాన్యం విక్రయం జరగక ఇబ్బందులు పడుతున్నామని, రానున్న రోజుల్లో వర్షాల కారణంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు.

Post a Comment

Previous Post Next Post