తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగితం వద్ద ఎన్ హెచ్చరిక 765డి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
గలీపూర్ గ్రామానికి చెందిన జంగా గంగారం (35) కూలి పనుల నిమిత్తం తన ఎక్సెల్ వాహనంపై బాన్సువాడకు వచ్చి కూలి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా సాయంత్రం అందాజ 7:30 గంటల సమయంలో మార్గమధ్యలో సింగీతం రోడ్డుకు కొద్దిగా ముందర ఎదురుగా వస్తున్న టీజీ 17 t 1683 నెంబర్ గల టిప్పర్ను నడుపు వ్యక్తి, టిప్పర్ను అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి గంగారం ఎక్సెల్ కు టక్కరివ్వగా, గంగారాం కాళ్లు, చేతులు, తల, ముఖం ఇతర శరీర భాగాలపై తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే చనిపోయినాడని తెలిపారు. మృతుని తల్లి జంగ మరియవ్వ ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు పచేస్తున్నట్లు తెలిపారు.
Post a Comment