TU Board of Directors |తెలంగాణ యూనివర్సిటి పాలకమండలి సభ్యుల నియామకం

 

#తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా ఘాజీ 

#ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి యోగీతా రాణా

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్  పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి డాక్టర్ యోగిత రాణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా చెందిన మహమ్మద్ ఘాజిని Telangana University పాలకమండలి (ఈసీ) సభ్యునిగా నియమిస్తూ జీవో విడుదలైంది.

తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ సభ్యులు వీరే:

01 సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజెస్ Prof. CH. Anjaneyulu, Dept of Business Management

02 ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ Dr. R. Sudhakar Goud, Associate Professor, Dept of Geoinformatics

03 ప్రిన్సిపాల్, అనుబంధ కాలేజ్ Dr. K. Sanjeeva Rao, Principal, Gauthami PG College, Nizamabad

04 టీచర్, యూనివర్సిటీ కాలేజెస్ Dr. Dandu Swamy, Assistant Professor, Giriraj College, Nizamabad

05 టీచర్, అనుబంధ కాలేజెస్ Prof. Madan Mohan, Devabakthuni, Indur PG College of Business Management Achanpally, Bodhan

06 నలుగురు ప్రముఖులు 1. Cherukuri Rajnikanth

2. Alle Lavanya, BA LLB, Saloora Village, Bodhan Mandal

3. Mohammed Ghazi

4. Dr. S. Jayanth MCA, http://M.Tech(CSE), Ph.D(CS)

ఈ ఉత్తర్వు DR. YOGITA RANA, SECRETARY TO GOVERNMENT, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా జారీ చేయబడింది. తెలంగాణ గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించారు.

సి ఎం కు కృతజ్ఞతలు : ఘాజీ 

సందర్భంగా మహమ్మద్ ఘాజి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddyకి, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు Mohammed Ali Shabbirకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం పేరుతో స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మహమ్మద్ ఘాజి స్పష్టం చేశారు.


Post a Comment

Previous Post Next Post