సబ్ కలెక్టర్ కు ఎం ఐ ఎం వినతి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ఎండలు తీవ్రంగా ఉన్నందున ట్రాఫిక్ సిగ్నల్స్ మూసివేయాలని MIM నాయకులు
బాన్సువాడ సబ్ కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండ వేడిమి 43 డిగ్రీలు దాటుతోందని, తీవ్రంగా ఎండలు మండిపోతున్న సమయంలో బస్టాండ్ వద్ద, తడ్కోల్ చౌరస్తా వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయిను మజ్లిస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఫాజిల్, ఆకిఫ్ హుస్సేన్ కోరారు. ద
ఈ సందర్భంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అతి త్వరలో ఈ విషయం పోలీస్ అధికారులకు తెలియజేసి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Post a Comment