Collector Visit | ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం వద్దు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం వద్దు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బుధవారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం అకాల వర్షాలు ప్రారంభమైనందున కొనుగోళ్ళను వేగవంతం చేయాలని ఆదేశించారు.


(Video👆)

అకాల వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా వేగంగా ధాన్యం మిల్లులకు తరలించాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. 

కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్‌ను తనిఖీ చేసి, ధాన్యం నిల్వలు, రవాణా , మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష చేసి ప్రతి రోజు కనీసం 15 లారీల దాన్యం దించుకోవాలి అని మిల్లర్ లను ఆదేశించారు.

అనంతరం శాబ్దిపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరి ఎల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రం, శ్రీ మన్నారాయణ రైస్ మిల్‌లను పరిశీలించారు.

అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 1,100 మెట్రిక్ టన్నుల వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

 ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వరి సేకరణ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వర్షాల వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కంధకం కాలువలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కుప్పలను టార్పాలిన్‌లతో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందకు కప్పి ఉంచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్ ,సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, తహశీల్దార్లు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

రైస్ మిల్లుల్లో వాహనాల అన్‌లోడింగ్‌పై సమీక్ష  

ధాన్యం కొనుగోలు అంశంపై గత మంగళవారం సాయంత్రం కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, డీసీఎస్ఓ, డీఎం-సీఎస్, డీసీవో, డీఆర్‌డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లుల వద్ద వాహనాల రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియపై సమీక్షించారు.  

ప్రతి మిల్లుకు ఒక జీపీవో నియామకం  

సమీక్ష సందర్భంగా ప్రతి రైస్ మిల్‌కు ఒక జీపీవోను నియమించి వాహనాల అన్‌లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్‌లోడింగ్ పూర్తైన వెంటనే వాహనాలను సంబంధిత పీపీసీలకు తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

సంబంధిత అధికారులంతా తక్షణ చర్యలు తీసుకొని రైస్ మిల్లుల వద్ద ధాన్యం వాహనాల రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.





Post a Comment

Previous Post Next Post