Top News

Collector | విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో టీచర్ల కీలక పాత్ర : కలెక్టర్


విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో టీచర్ల కీలక పాత్ర : కలెక్టర్ 

రాజంపేటలో విద్యా వారోత్సవాలు 

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలెక్టర్ సమావేశం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం రాజంపేట మండలంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో విద్యా వారోత్సవాలను నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమావేశమయ్యారు.

పదో తరగతి విద్యార్థులకు సన్మానం  

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాజంపేట మండలంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆదేశం  

జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌లో తరగతి గదుల నిర్మాణం, మరమ్మతుల అవసరాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఏఈ పీఆర్‌ను కలెక్టర్ ఆదేశించారు. గ్రామపంచాయతీ నిధుల నుంచి 50 శాతం నిధులను సర్పంచ్ మంజూరు చేస్తారని, మిగతా నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తామని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తులో కీలక పాత్ర  

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో విద్యపట్ల ఆసక్తి పెంపొందించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, ఎంఆర్ఓ, హెచ్ఎం ఈశ్వర్, సర్పంచ్ శ్రీకాంత్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post