Complaint to MLA | 'బెస్ట్ ఎవైలెబుల్ స్కీం లో సీట్లు తొలగిస్తున్నారు'


'బెస్ట్ ఎవైలెబుల్ స్కీం లో సీట్లు తొలగిస్తున్నారు'

 ఎమ్మెల్యే కు తల్లిదండ్రుల ఫిర్యాదు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

నస్రుల్లాబాద్ మండలంలో గల ఓ ప్రయివేట్  పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా చదువుతున్న 144 విద్యార్థులను తొలగిస్తామని యాజమాన్యం చెబుతోందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం  బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయన నివాస గృహంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 

ఈ విద్యా సంస్థలో వివిధ తరగతుల్లో  మొత్తం 144 మంది ఎస్సీ విద్యార్థులు చదువుతున్నారని, అయితే 2026-2027 విద్యా సంవత్సరానికి గాను వీరిని తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్థులు వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో అర్హత ఉన్న పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని మొత్తం 144 మంది విద్యార్థులకు BAS లో ప్రవేశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో మెక్క సురేష్, సంగం పండరి, పోశెట్టి, అశోక్, విట్టల్‌ ఉన్నారు. గ్రామీణ ప్రాంత ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు BAS సీట్లు పెంచడం అత్యవసరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వెంటనే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.





Post a Comment

Previous Post Next Post