Top News

Youth Congress Presidents | యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం



కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం

జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రకటన

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి:  

కామారెడ్డి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నియామకాలు జరిగాయి. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి శనివారం కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పట్టణం, మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ నియామక పత్రాలు విడుదల చేశారు.

ఏఐసీసీ యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖాలిద్ అహ్మద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు.

నూతనంగా నియమితులైన అధ్యక్షులు: కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా అజ్మత్, కామారెడ్డి రూరల్ మండల అధ్యక్షుడిగా హన్మండ్ల రామ్ కుమార్, భిక్నూర్ మండల అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, రాజంపేట మండల అధ్యక్షుడిగా టి. ప్రభాకర్ గౌడ్, బీబీపేట మండల అధ్యక్షుడిగా ఎం. మహేష్, దోమకొండ మండల అధ్యక్షుడిగా పిన్నం నాగేంద్ర వర్మ, పాల్వంచ మండల అధ్యక్షుడిగా సమరసింహా రెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షుడిగా రాజా రెడ్డి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నూతన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. యువతను ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా ఇంచార్జుల పర్యవేక్షణలో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. నూతన అధ్యక్షులకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలిపాయి.

Post a Comment

Previous Post Next Post