•కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల నియామకం పూర్తి
•ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 24 మంది నూతన అధ్యక్షుల నియామకం
•క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ సూచన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 24 మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను నియమించారు. డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు జరిగాయి. బాన్స్ వాడ నియోజకవర్గం లో అధ్యక్షుల నియామకం జరగలేదు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం:
ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచనల మేరకు 7 మండలాలకు అధ్యక్షులను నియమించారు.
1. నాగిరెడ్డి పేట్ – బి. శ్రీధర్ గౌడ్
2. ఎల్లారెడ్డి – కుర్మ సాయిబాబా
3. లింగంపేట్ – గొల్ల సాయిరాం యాదవ్
4. సదాశివనగర్ – నల్ల మహిపాల్ రెడ్డి
5. తడ్వాయి – బండారి సంజీవులు
6. రామారెడ్డి – మొగిళ్ల ప్రవీణ్ గౌడ్
7. గాంధారి – సింగసాని శ్రీనివాస్
నూతన అధ్యక్షులను అభినందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కామారెడ్డి నియోజకవర్గం:
మే 2న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 8 మండల, టౌన్ కమిటీలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
1. కామారెడ్డి రూరల్ – ధర్మగౌరి రాజా గౌడ్
2. మాచారెడ్డి – మలోత్ నౌసిలాల్ నాయక్
3. పాల్వంచ – రమేష్ గౌడ్
4. బిబిపేట్ – పాత రాజు
5. దోమకొండ – ఆశబోయిన శ్రీనివాస్
6. భిక్కనూర్ – నాగనగరి నరేందర్ రెడ్డి
7. రాజంపేట – అంకం కృష్ణారావు
8. కామారెడ్డి టౌన్ – ఐరేని సందీప్
వీరిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించి, ఆయా మండలాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ సూచించారు.
జుక్కల్ నియోజకవర్గం:
మే 5న టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ 9 మండల, టౌన్ కమిటీలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయి.
1. మహమ్మద్‌నగర్ – నాగిరెడ్డిపేట్ రవీందర్ రెడ్డి
2. నిజాంసాగర్ – ప్రజా పందారి
3. పిట్లం – మేగావత్ రవీందర్
4. పెద్దకొడప్‌గల్ – మడప్పవార్ శ్యామప్ప
5. జుక్కల్ – కులకర్ణి రమేష్ దేశాయ్
6. మద్నూర్ – దారాస్ సైలు
7. డోంగ్లి – కులకర్ణి గజానన్
8. బిచ్కుంద – మున్నూర్ నాగనాథ్
9. బిచ్కుంద టౌన్ – కె. విజయ భాస్కర్ రెడ్డి
జుక్కల్‌లో సన్మానం:
నిన్న రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన మండల అధ్యక్షులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సన్మానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
డీసీసీ అధ్యక్షుని దిశానిర్దేశం:
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ఈ నియామకాలు కీలకమని, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు ప్రజల మధ్యకి వెళ్లి కాంగ్రెస్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సమిష్టి కృషితో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, సంస్థాగత నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన అధ్యక్షులను కోరారు.
.jpeg)




Post a Comment