Sun Stroke Death | వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

•వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి  

•కాలకృత్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన  

•ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: మండలంలోని బోర్లం క్యాంప్ తాండకు చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. 

పోలీసుల వివరాల ప్రకారం, బోర్లం క్యాంప్ తాండకు చెందిన పాతులోత్ బస్సు( 58), ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ చివరకు వెళ్లాడు. అనంతరం కడుక్కోవడానికి కాలువ వద్దకు వెళుతుండగా మార్గమధ్యలో వడదెబ్బతో కళ్లు తిరిగి కిందపడిపోయాడు.

వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డ్యూటీ డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతుని కొడుకు పాతులోతు చందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బాన్సువాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.

ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post