•13 ఓట్లతో ముజ్జు ఎన్నిక, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై విజయం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
శుక్రవారం జరిగిన బాన్సువాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. నామినేషన్లు వేసిన నలుగురు కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు ఏకగ్రీవంగా, ఒకరు ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా కాసుల రోహిత్, ఖమర్ సుల్తానా గౌస్, ఉల్లవ్వ ఏకగ్రీవంగా, మొహమ్మద్ మజీద్ ముజ్జు ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు.
మైనారిటీ కోటాలో ఓటింగ్
మైనారిటీ కోటాలో కాంగ్రెస్ తరఫున మొహమ్మద్ మజీద్ ముజ్జు నామినేషన్ వేయగా, బీజేపీ నాయకుడు రాజాసింగ్ పోటీ చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, ఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు మద్దతు పలికారు. దీంతో 13 ఓట్లతో ముజ్జు విజయం సాధించారు.
గైర్హాజరు, ఆలస్యం
సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు గైర్హాజరయ్యారు. బీజేపీ సభ్యులు ఓటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ బాలరాజు అధ్యక్షతన, వైస్ చైర్మన్ రేష్మ ఏజాజ్ సమక్షంలో, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ హాయ్యుమ్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ సాగింది.
నామినేషన్ల ప్రక్రియలో
నామినేషన్ల దాఖలు చివరి రోజు సందర్భంగా కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్ ముజ్జు, కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్‌లు కోఆప్షన్ సభ్యత్వానికి నామినేషన్లు దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో ప్రతిమా రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, ఉల్లవ్వ నామినేషన్‌ను అధికారులు ఆమోదించిన విషయం విదితమే.
హాజరైన కౌన్సిలర్లు
ఈ సమావేశంలో కౌన్సిలర్లు నార్ల నందకిషోర్, అబ్దుల్ కాలేక్, హకీమ్, రమేష్ కాటికే, జంగం రాజు, నాగేష్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
కోఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా స్పందన
బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఉమ్మడి జిల్లా మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర, బాన్సువాడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, 13వ వార్డు కౌన్సిలర్ ఖాలాక్, టీచర్స్ కాలనీ వాసులకు ఖమర్ సుల్తానా గౌస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సదా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.




Post a Comment