రాజీవ్ గాంధీ వర్ధంతి: డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులు
దేశ అభివృద్ధికి దూరదృష్టితో పనిచేసిన మహానేత: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
భారత రత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేశారు.
అనంతరం టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి దూరదృష్టితో పనిచేసిన మహానేతగా రాజీవ్ గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. యువతకు సాంకేతిక విప్లవాన్ని అందించిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment