![]() |
| ప్రయాణికుడికి బ్యాగ్ అప్పగిస్తున్న దృశ్యం |
•మెదక్ జేబీఎస్ బస్సులో మరిచిపోయిన బ్యాగును అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది
•నిజాయితీ చాటుకున్న కండక్టర్ మహాదేవ్ గంగారాం, డ్రైవర్ నాగరాజు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: మెదక్ నుంచి జేబీఎస్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షేక్ అహ్మద్ జియా అనే ప్రయాణికుడు తన విలువైన వస్తువులతో కూడిన బ్యాగును మర్చిపోయాడు. అతను సిటీలో దిగిపోయిన తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో బస్సు కండక్టర్ ఫోన్ నెంబర్ తెలుసుకుని సంప్రదించాడు.
వెంటనే స్పందించిన కండక్టర్ మహాదేవ్ గంగారాం ఆ బ్యాగును భద్రంగా తీసుకుని, జేబీఎస్‌లో ఉన్న చార్జింగ్ పాయింట్‌కు రమ్మని ప్రయాణికుడికి సమాచారం అందించాడు. అక్కడ డ్రైవర్ నాగరాజు సమక్షంలో బ్యాగును ప్రయాణికుడికి అప్పగించారు.
బ్యాగులో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన సామాన్లు ఉన్నాయి. అన్నీ సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికుడు కండక్టర్, డ్రైవర్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు.
నిజామాబాద్ 2వ డిపోకు చెందిన కండక్టర్ మహాదేవ్ గంగారాం బాన్సువాడలో నివాసం ఉంటున్నారు. నిజాయితీగా వ్యవహరించి ప్రయాణికుడి విలువైన బ్యాగును అప్పగించిన కండక్టర్ మహాదేవ్ గంగారాం, డ్రైవర్ నాగరాజులను ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు అభినందిస్తున్నారు.
నోట్ : వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేయగలరు.



Post a Comment