వరి, బియ్యం రవాణా రేట్లపై రాష్ట్ర స్థాయి కమిటీ వీడియో కాన్ఫరెన్స్
కామారెడ్డి కలెక్టర్ హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: రబీ 2025-26, ఖరీఫ్ 2026-27 సీజన్‌లకు వరి, స్టేజ్-I బియ్యం రవాణా కాంట్రాక్టర్ల నియామకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో భాగంగా రవాణా రేట్ల ఆమోదంపై రాష్ట్ర స్థాయి కమిటీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రబీ 2025-26, ఖరీఫ్ 2026-27 కాలానికి వరి రవాణా రేట్లు, స్టేజ్-I బియ్యం రవాణా రేట్ల ఆమోదం, మిల్లింగ్ పాయింట్ల నుండి బఫర్ గోదాముల వరకు CMR రవాణా రేట్ల నిర్ణయంపై సమీక్ష జరిపారు.
జిల్లాలో వరి కొనుగోలు, రవాణా ప్రక్రియల నిర్వహణ, మిల్లింగ్ పాయింట్లకు ధాన్యం తరలింపు, బియ్యం రవాణా ఏర్పాట్లపై జిల్లా స్థాయి అమలు విధానాలను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో కమీషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, కామారెడ్డి, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment