Talasemia Seminar | తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన



బాన్సువాడలో తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన

తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని వైద్యుల సూచన  

తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ: పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

(Video 👆)

ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ భాస్కర్, డిప్యూటీ DM&HO డాక్టర్ విద్యతో పాటు ఇతర ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు తలసేమియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

వైద్యుల సూచనలు:

ప్రతి ఒక్కరూ తలసేమియా రక్త పరీక్ష చేయించుకోవాలని, పరీక్షలో పాజిటివ్ వస్తే వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాలని డాక్టర్లు సూచించారు. తలసేమియా వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధిత వ్యాధి అని, ముందస్తు గుర్తింపుతో నియంత్రించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం తలసేమియాపై కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించింది.

Post a Comment

Previous Post Next Post