Top News

Felicitation | చైర్మన్లకు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సన్మానం

 




మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్, బీసీ సలహాదారులకు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సన్మానం 

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: నూతనంగా నియామకమైన మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాములును తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, ప్రదీప్ పటేల్  హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.

అదే రోజు జరిగిన మరో కార్యక్రమంలో నూతనంగా నియామకమైన తెలంగాణ ప్రభుత్వ బీసీ సలహాదారు వి.హెచ్. హనుమంత్ రావును కూడా అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, ప్రదీప్ పటేల్ సన్మానించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ రెండు వేర్వేరు కార్యక్రమాల్లో నూతనంగా నియామకమైన నేతలకు శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారు తమ పదవుల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.

Post a Comment

Previous Post Next Post