Top News

VG Goud | డిజిటలైజేషన్ ద్వారా సభ్యత్వ నమోదు

డిజిటలైజేషన్ ద్వారా సభ్యత్వ నమోదు: 

మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్

తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్: 

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి వీజీ గౌడ్ తెలిపారు.  బీర్కూర్ గ్రామంలో అయన  శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు.  

ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ రెండు కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని వీజీ గౌడ్ పేర్కొన్నారు.  

సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియపై గ్రామ, మండల స్థాయిల్లో కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బీఆరెస్ నాయకుడు ఖాజా, బాలకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post