Water Problems Solved by Shabbir Ali | కామారెడ్డిలో నీటి కష్టాలు తీర్చిన షబ్బీర్ అలీ: చైర్‌పర్సన్ ఉమారాణి

కామారెడ్డిలో నీటి కష్టాలు తీర్చిన 'అపర భగీరథుడు' షబ్బీర్ అలీ: చైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్  

20 ఏళ్ల క్రితం నీటి కరువు

షబ్బీర్ అలీ చేపట్టిన మహా యజ్ఞం  

4 MLD నుంచి 19 MLDకు సరఫరా పెంపు  

ట్యాంకర్లకు స్వస్తి, నల్లాల ద్వారానే నీరు

అమృత్ 2.0 కింద 9 కొత్త ట్యాంకులు మంజూరు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: రెండు దశాబ్దాల క్రితం కామారెడ్డిని పట్టి పీడించిన తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చింది మహమ్మద్ అలీ షబ్బీర్ అని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కొనియాడారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. (Video 👇)


20 ఏళ్ల క్రితం కామారెడ్డి నియోజకవర్గంలో వర్షాకాలం మినహా మిగిలిన అన్ని సీజన్లలో, ముఖ్యంగా వేసవిలో తీవ్ర నీటి కొరత ఉండేది. ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారు. 

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ఈ సమస్యపై తపస్సులా పనిచేశారు. సీఎం వైఎస్‌ను ఒప్పించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 110 కి.మీ దూరం పైపులైన్లు వేయించారు. మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి గ్రామాలకు నీరందించారు. దీంతో పదేళ్లపాటు కామారెడ్డిలో నీటి కష్టాలు తీరాయి. 


ప్రస్తుతం నూతన పైప్‌లైన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖల అనుమతుల సమస్యలను షబ్బీర్ అలీ స్వయంగా పరిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 MLD మాత్రమే ఉన్న నీటి సరఫరాను 19 MLDకు పెంచే పనులు జరుగుతున్నాయి. 

ఈ వేసవిలో షబ్బీర్ అలీ ప్రతిరోజూ అధికారులతో సమీక్షలు జరిపి పట్టణానికి 8-10 MLD నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. గత 10 ఏళ్లుగా వేసవిలో కనిపించే వాటర్ ట్యాంకర్లు ఇప్పుడు ఎక్కడా లేవని, నల్లాల ద్వారానే పుష్కలంగా నీరు వస్తోందని చైర్‌పర్సన్ తెలిపారు. 

ప్రస్తుతం పట్టణంలో 10 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అమృత్ 2.0 పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి చొరవతో, షబ్బీర్ అలీ సహకారంతో మరో 9 ట్యాంకులు మంజూరయ్యాయి. రూ.11.89 కోట్లతో నిర్మిస్తున్న ఈ ట్యాంకులు పూర్తయితే 19 MLD నీటి సరఫరాతో సమస్య పూర్తిగా తీరుతుంది. 

కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చిన షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వినోద్, కౌన్సిలర్లు వాజీద్, జావేద్, అంజాద్, బబ్లు, కాళ్ల గణేష్, కళ్లెం సత్యం, అన్వర్, లడ్డు, సిద్ధిక్, యూనస్, చిట్టిబాబు, భూపతి, పట్టణ అధ్యక్షులు సందీప్, గాజీ, గంప ప్రసాద్, సురేష్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post