జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించుకోవాలి: కలెక్టర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 20: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 40వ ఒలింపిక్ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
జడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల నుంచి ప్రారంభమైన ఒలింపిక్ డే రన్ కాకతీయ నగర్‌లోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వరకు సాగింది. ఈ రన్‌లో వందలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కలెక్టర్ సందేశం
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, "క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలి" అని సూచించారు.
ఒలింపిక్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వీ గిరి, జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కె.పి. అనిల్ కుమార్, చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.








Post a Comment