Top News

Bike Theft Case | బైక్ దొంగతనం కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష

బైక్ దొంగతనం కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష

పకడ్బందీ దర్యాప్తు చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ 

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

బైక్ దొంగతనం కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ కామారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.  

వివరాల్లోకి వెళితే, తేదీ 21.10.2025న రామారెడ్డి మండలానికి చెందిన కాసర్ల రాజేందర్ తన TS-17-H-8752 నంబరు గల బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను వ్యవసాయ పొలం వద్ద పార్క్ చేసి పనులకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించకపోవడంతో, మరుసటి రోజు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, పాత నేరస్తుల కదలికలను విశ్లేషించి మిట్టపల్లి లక్ష్మణ్ (32)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.  

విచారణ సందర్భంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ కామారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ కే. సుధాకర్ గారు నేరం రుజువైనందున నిందితుడికి 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.  

కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం. రజనీ, రామారెడ్డి SHO పి. రాజశేఖర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, సీడీవో ఆర్. సాయిలులను జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర అభినందించారు.

----------------------  

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర 

కామారెడ్డి  జిల్లాలో శాంతి భద్రతలను  దృష్టిలో  వుంచుకొని నెల రోజుల పాటు (జులై 1వ తేది నుండి 31  వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని   కామారెడ్డి  జిల్లా ఎస్పీ   యం. రాజేష్ చంద్ర  తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ గారు హెచ్చరించారు.  జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు.    అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


                                                                                                                                                                                                                                                                                 

                                                                          

Post a Comment

Previous Post Next Post