మున్సిపల్ 3వ వార్డులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ
చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అక్షర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు పరిధిలోని కొయ్యగుట్ట ప్రి-ప్రైమరీ స్కూల్‌లో కార్యక్రమం నిర్వహించారు.
స్కూల్ హెడ్ మిస్ విజయ లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 3వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అక్షర అభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ హకీమ్ మాట్లాడుతూ, "అక్షర అభ్యాసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ చదవాలనే. చదువుతోనే జీవితంలో వెలుగు, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది" అని అన్నారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం కౌన్సిలర్ హకీమ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment