బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ బాధ్యతల స్వీకరణ
పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత
మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి - నూతన కమిషనర్ వెల్లడి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ పురపాలక సంఘ నూతన కమిషనర్‌గా గోపు గంగాధర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
భీంగల్ నుంచి బదిలీ
గోపు గంగాధర్ గతంలో భీంగల్ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్‌గా విధులు నిర్వహించారు. బదిలీపై బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి కమిషనర్‌గా నియమితులయ్యారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పట్టణ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment