Top News

Collector | పాఠశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత


పాఠశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత  

ఆహార భద్రత సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశం  

మూడు శాఖల సమన్వయంతో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్8: పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలోని వంటవారు తప్పనిసరిగా మంచి పరిశుభ్రత పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  

సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం జరిగింది. ఆహార భద్రత అధికారి జి. విక్రమ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఆహార భద్రత శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హాస్టళ్లు, పాఠశాలల్లో వడ్డించే భోజనంలో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.  

వంట గదులు, నిల్వ ప్రాంతాలు, వాడే నీటి నాణ్యతపై నిరంతరం తనిఖీలు చేయాలని, ఆహార పదార్థాల కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ నిధులు

8446 మంది లబ్ధిదారులకు ఎస్టిమేట్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

మరుగుదొడ్ల ఫోటోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశం  

కామారెడ్డి, జూన్ 8: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  

08.06.2026న జరిగిన ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ & డి.పి.సి., MGNREGS, కామారెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయమై సంబంధిత అధికారులతో చర్చించారు.  ముఖ్యాంశాలు:

ఉపాధి హామీ నిధులు: కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 8446 లబ్ధిదారులకు MGNREGS ఉపాధి హామీ పథకం కింద ఎస్టిమేట్లు తయారు చేసి కలెక్టర్ ద్వారా మంజూరు చేయించాలి. మస్టర్ ద్వారా లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చూడాలని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు.  

SBM మరుగుదొడ్లు: SBM ద్వారా మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం పూర్తయిన తర్వాత మరుగుదొడ్డి ఫోటోలను App లో upload చేయాలి. ఇప్పటి వరకు ఎస్టిమేట్లు తీసుకోని లబ్ధిదారులకు వెంటనే ఎస్టిమేట్లు వేసి మంజూరు తీసుకోవాలని MPDO లను ఆదేశించారు.  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులను ఇళ్ల నిర్మాణానికి వినియోగించడం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.  

ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, DRDA, కామారెడ్డి కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.

Post a Comment

Previous Post Next Post