యోగాతో ఆరోగ్యం: బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి: ఆర్డీవో రవీందర్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం యోగా వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయుష్ విభాగం నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. (వీడియో 👇)
ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది” అని అన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడిని జయించేందుకు యోగా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, కాసుల రోహిత్, కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
యోగాపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.








Post a Comment