వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
2026-2028 కొత్త అక్రిడిటేషన్లకు అనుగుణంగా రాయితీ బస్‌పాస్‌లు
టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీకి ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ లేఖ
జూన్ 17 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు వ్యాలిడిటీతో ఆన్‌లైన్ దరఖాస్తు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్, జూన్ 11: తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-2028 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు రాయితీ బస్‌పాస్‌లు జారీ చేయాలని టీఎస్‌ఆర్‌టీసీని కోరింది.
ఎండీకి ముకుంద రెడ్డి లేఖ
ఈ మేరకు ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి బుధవారం టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారిక లేఖ రాశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ కాలానికి అనుగుణంగా 2026-2028 వ్యాలిడిటీతో బస్‌పాస్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు.
జూన్ 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు
ప్రస్తుత బస్‌పాస్‌ల గడువు ఈ నెల 16తో ముగియనున్న నేపథ్యంలో 17.06.2026 నుండి 30.04.2028 వరకు వ్యాలిడిటీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అక్రిడిటేషన్ల జారీ కొనసాగుతోంది
ఈ సందర్భంగా కొత్త అక్రిడిటేషన్లపై ముకుంద రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశామని, మిగిలిన కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Post a Comment