Top News

MCB 3rd Ward | మున్సిపల్ కార్యాలయంలో 3వ వార్డు సభ విజయవంతం

బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో 3వ వార్డు సభ విజయవంతం  

ప్రజా సమస్యలపై చర్చ, పరిష్కారానికి అధికారుల హామీ  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:   కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు 3వ వార్డు సభను కౌన్సిలర్ హకీమ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వార్డు సభ జరిగింది. 

ఈ కార్యక్రమంలో 3వ వార్డు నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. వార్డు వాసులు తమ సమస్యలైన ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్, జీరో కరెంట్ బిల్లు, రేషన్ కార్డులు, ఇంటి నంబర్ కేటాయింపు, రోడ్లు, డ్రైనేజీ పనులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి చర్చించారు.  

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ ఏజాజ్, మాజీ జిల్లా పరిషత్ కో-ఆప్షన్ మెంబర్ షేక్ అలీం ఉద్దీన్ బాబా, సీనియర్ నాయకులు షేక్ మొయిన్, మొహమ్మద్ ఇలియాస్, మొహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. అధికారుల్లో మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్, మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సంగమేశ్వర, విద్యుత్ శాఖ అధికారి మోహన్, రిప్రజెంటేటివ్ మెంబర్లు జమీల, రేఖ తదితరులు హాజరయ్యారు.  

3వ వార్డు సభను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులు, నాయకులకు కౌన్సిలర్ ఎం ఏ హకీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





Post a Comment

Previous Post Next Post