నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి బోధన్‌కు తాగునీటి విడుదల
నేటి నుంచి 1000 క్యూసెక్కులు విడుదల
కాలువ వద్దకు వెళ్లొద్దని ఇరిగేషన్ శాఖ హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: బోధన్ పట్టణం, పరిసర గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలోకి నేడు సాయంత్రం 4 గంటలకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాలువ పరిధిలోని రైతులు, పశువుల కాపరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాలువలోకి గానీ, కాలువ గట్లపైకి గానీ ఎవరూ ప్రవేశించరాదు. పశువులను కాలువ సమీపానికి తీసుకురాకూడదు. చిన్నపిల్లలను కాలువ ప్రాంతాలకు వెళ్లనీయవద్దని కోరారు.
సాగుకు వాడొద్దు
ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కేవలం బోధన్ పట్టణం పరిసర గ్రామాల తాగునీటి అవసరాలకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ నీటిని సాగునీటి అవసరాల కోసం వినియోగించవద్దని రైతులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment