Top News

Over Load Vehicles | కామారెడ్డిలో ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా!

File Photo 

కామారెడ్డిలో ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ కొరడా 

_మంత్రి పొన్నం ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు_  

_నిబంధనలు ఉల్లంఘించిన మూడు భారీ వాహనాలు సీజ్: డీటీఓ సంతోష్ కుమార్_  

_క్వారీ నిర్వాహకులు, వాహన యజమానులకు అధికారుల హెచ్చరిక_  

_తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయి: రవాణా శాఖ_

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 21: ఓవర్‌లోడ్‌తో రోడ్లపై ప్రమాదకరంగా తిరుగుతున్న వాహనాలపై కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది.

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప రవాణా కమిషనర్ దుర్గ ప్రమీల మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 

ఈ తనిఖీలలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి లోడ్‌తో వెళ్తున్న మూడు భారీ వాహనాలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి టి.సంతోష్ కుమార్ వెల్లడించారు. 

ఓవర్‌లోడ్ రవాణా చేయవద్దు: డీటీఓ 

క్వారీ నిర్వాహకులు, భారీ వాహనాల యజమానులు ఎవరూ వాహనాలలో ఓవర్‌లోడ్ రవాణా చేయకూడదని డీటీఓ సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఓవర్‌లోడ్ వల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రఫీ, కృష్ణ తేజ, రవాణా శాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.



కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా ఓవర్ లోడ్ వాహనాల తనిఖీలు: మూడు వాహనాలు సీజ్

 రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ దుర్గ ప్రమీల మార్గదర్శకాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓవర్‌లోడ్‌తో తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది.

ఈ తనిఖీలలో భాగంగా కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) టి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి లోడ్‌తో వెళ్తున్న మూడు భారీ వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. క్వారీ నిర్వాహకులు, భారీ వాహనాల యజమానులు ఎవరూ కూడా వాహనాలలో ఓవర్‌లోడ్ రవాణా చేయకూడదని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) శంకర్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) రఫీ, కృష్ణ తేజ, రవాణా శాఖ కానిస్టేబుళ్లు మరియు హోంగార్డులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post