Top News

Professor Vardhanti | యాప్ తొలగించకుంటే రైతులతో కలిసి ఉద్యమం: బీఆర్ఎస్ హెచ్చరిక

నసురుల్లాబాద్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి 

_బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి_  

_కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేవు: మాజీ రైతు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి_  

_యూరియా యాప్ వల్లే రైతుల కష్టాలు: వెంటనే తొలగించాలి_  

_యాప్ తొలగించకుంటే రైతులతో కలిసి ఉద్యమం: బీఆర్ఎస్ హెచ్చరిక_

తెలంగాణ డైలీ న్యూస్, నసురుల్లాబాద్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కామారెడ్డి జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకాలంలో సమకూర్చామని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు అన్నీ అందుబాటులో ఉంచేవారని తెలిపారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీల ముందు రైతులు చెప్పులను క్యూలో పెట్టి గంటల తరబడి నిల్చుంటున్నారని ఆరోపించారు.

వెంటనే యూరియా యాప్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాలు, ఆందోళనలు చేస్తామని అంజిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post