Top News

SIR Awareness | బాన్సువాడలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన శిబిరం

బాన్సువాడలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన శిబిరం  

_ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు హాజరు_  

_బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ_  

_రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్‌లో ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం_

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 22: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై బాన్సువాడ నియోజకవర్గంలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు.


ముఖ్య అతిథులుగా ప్రముఖులు

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కూడా పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సవరణపై దిశానిర్దేశం

ఎస్.ఐ.ఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో వర్ని బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, దుర్గం శ్యామల, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, అబ్దుల్ ఖాలేఖ్,మహ్మద్ గౌస్, ముజ్జు, నార్ల రవీందర్, అసద్ బిన్ మోసిన్, మోహన్ నాయక్, వహబ్, యండి. దావూద్, మధుసూదన్,  బాన్సువాడ పట్టణ, మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post