Suicide on Railway Track | భిక్నూర్ రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

గుర్తు తెలియని మృతదేహం లభ్యం  

భిక్నూర్ రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య  

మృతదేహం గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి  

రైల్వే ఎస్సై సాధు లింబాద్రి వెల్లడి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 16: బిక్నూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం  రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కామారెడ్డి రైల్వే ఎస్సై సాధు లింబాద్రి వివరాలు వెల్లడించారు.

కేఎం నెంబర్ 531/13-14 వద్ద రైల్వే ట్రాక్‌పై అందాజా 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న మగ వ్యక్తి ఆత్మహత్య ఉద్దేశంతో గుర్తుతెలియని రైలు కింద పడ్డాడు. దీంతో తల భాగం, ముఖం గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయ్యాయి. కుడి చేయి కట్ కాగా, కుడి కాలు పాదం కూడా నుజ్జు నుజ్జు అయింది.

మృతుని వద్ద ఎలాంటి ఐడీ ప్రూఫ్ లభించలేదు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ఆనవాళ్లు విడుదల చేశారు.

మృతుడి వివరాలు:  

ఎత్తు: ఐదు ఫీట్ల రెండు అంగుళాలు  

దుస్తులు: బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ బెల్ట్, బ్లూ కలర్ ఆఫ్ షర్ట్, బ్లూ కలర్ చినిగిన టీ షర్ట్  

చెప్పులు: బ్రౌన్ కలర్

పై ఆనవాళ్లతో ఉన్న వ్యక్తి గురించి తెలిసిన వారు, మృతుడిని గుర్తించిన వారు కామారెడ్డి రైల్వే ఎస్సై సాధు లింబాద్రి సెల్ నెంబర్ 87126 58614 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

1 Comments

Post a Comment

Previous Post Next Post