బాన్సువాడలో కాంగ్రెస్ నేతల ఆత్మీయ భేటీ
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సన్మానం, ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా సందుల రవి నియామకంపై హర్షం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 06: బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, వ్యవసాయ రంగంలోని సమస్యలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ఎమ్మెల్యేతో విస్తృతంగా చర్చించారు.
బరంగ్ ఏడగి గ్రామానికి చెందిన సందుల రవిని ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియమించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సేవలో వారి కృషిని, రైతాంగ సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు కొనియాడారు. సందుల రవి నియామకం గ్రామీణ వ్యవసాయాభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గొండ్ల శ్రీనివాస్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవి, నాయకులు కాదేపురం గంగన్న, గాజుల పండరి, ఇందూర్ గజేందర్, హొక్కారి అశోక్, మొండ్కారి కామప్ప, వడ్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Post a Comment