కామారెడ్డిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
బీజేపీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం.. గురువులకు సన్మానం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
34వ వార్డు పరిధిలోని ఆర్యసమాజ మందిరంలో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు వేశారు. (వీడియో 👇)
యోగా అనంతరం కార్యక్రమానికి హాజరైన యోగా గురువులను పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. యోగా ప్రాముఖ్యతను, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురువులు వివరించారు.
యోగా కేవలం వ్యాయామం కాదని, శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలమని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.




Post a Comment