Top News

BRS In SIR | బాన్సువాడలో SIR ఫారాలను BLOలకు అందజేసిన BRS నాయకులు

బాన్సువాడలో SIR ఫారాలను BLOలకు అందజేసిన BRS నాయకులు

218, 219, 220 బూత్‌ల ఓటర్ల నుంచి ఫారాల సేకరణ

బాన్సువాడ: పట్టణంలోని 218, 219, 220 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్ల నుంచి SIR - Special Intensive Revision ఫారాలను సేకరించి BRS పార్టీ BLAలు సంబంధిత BLOలకు అందజేశారు.

BRS పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల నుంచి SIR ఫారాలను స్వీకరించారు. సేకరించిన ఫారాలను BLAలు పూర్తిగా పరిశీలించి, నింపిన అనంతరం సంబంధిత BLOలకు అప్పగించారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ మైనారిటీ నాయకులు మహమ్మద్ ఇసాక్, BRS BLAలు షేక్ అఫ్జల్, యాహియా ఖాన్, ఖాలెత్, యువ నాయకులు మొహమ్మద్ పటేల్, BLOలు వనజ, నవీత, వినోద,వార్డు ఓటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ SIR ఫారాన్ని సక్రమంగా సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post