బిల్లుల చెల్లింపులో అవకతవకలపై ఫిర్యాదు
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నాయని మున్సిపల్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కమిషనర్, అకౌంటెంట్ కమిషన్ తీసుకొని పర్సెంటేజ్ ఆధారంగా బిల్లులు రాస్తున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్ ఆరోపణలు ఉన్న బిల్లులు కూడా ఆమోదిస్తున్నారని ఆరోపించారు.
ఉన్నతాధికారులకు లిఖిత ఫిర్యాదు
1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా అధికారులు బిల్లులు ఇస్తున్నారని పేర్కొంటూ సిఎంఓ ఎంఏ అండ్ యుడి, రాష్ట్ర విజిలెన్స్, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ లకు ఫిర్యాదు అందించారు.
సమగ్ర విచారణ జరపాలి
శానిటేషన్, వాటర్ వర్క్స్, జనరల్ ఫండ్, 14వ, 15వ ఫైనాన్స్, స్పెషల్ డెవలప్‌మెంట్ బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు బిల్లులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ పార్వతాలు, అకౌంటెంట్ రాములు తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
=================
ప్రభుత్వ పార్క్‌ను ప్రైవేట్ వెంచర్ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపణ
అడ్లూర్ శివారులో ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న వెంచర్ లో ప్రభుత్వ పార్క్‌కు వెంచర్ యజమాని తాళం వేసి తన ఆధీనంలోకి తీసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కామారెడ్డి మున్సిపాలిటీ సిబ్బంది ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది.

Post a Comment