Top News

Death in Bahrain | బహ్రెయిన్‌లో నిజామాబాద్ వాసి దుర్మరణం

 

బహ్రెయిన్‌లో నిజామాబాద్ వాసి దుర్మరణం  

సముద్రంలో మునిగి శ్రీనివాస్ మృతి  

2019 నుంచి MAC కంపెనీలో ఉద్యోగం

నిజామాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:  

బహ్రెయిన్‌లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట మృతి చెందారు.  

వివరాల ప్రకారం... శ్రీనివాస్ సముద్రంలో ఈతకు వెళ్లి నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు.  

శ్రీనివాస్ 2019 నుంచి బహ్రెయిన్‌లోని మహమ్మద్ అహ్మద్ కో (MAC) సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల MAC సంస్థ యాజమాన్యం తీవ్ర సంతాపం ప్రకటించింది.  

సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post