పట్టణంలోని ప్రముఖ వైద్యులకు ఘన సన్మానం
డాక్టర్ జీవన్ రెడ్డి, డాక్టర్ అచ్చుకట్ల జీవన్‌కు సత్కారం
అన్విత, బాలాజీ హాస్పిటల్ వైద్య దంపతులకు సన్మానం
డెంటిస్ట్ అనిల్ రెడ్డిని సత్కరించిన లయన్స్ క్లబ్ సభ్యులు
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
బాన్సువాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
డాక్టర్ జీవన్ రెడ్డి, రుక్మిణి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అచ్చుకట్ల జీవన్, అన్విత హాస్పిటల్ డాక్టర్స్ సంతోష్ దంపతులు, బాలాజీ హాస్పిటల్ డాక్టర్స్ రాజశేఖర్ దంపతులు, డెంటిస్ట్ అనిల్ రెడ్డిని లయన్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఖలీద్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బెజుగం వెంకట రమణ, సభ్యులు కాచం శ్రీనివాస్, చిదుర వినయ్, తాటి రాము తదితరులు పాల్గొన్నారు.








Post a Comment