Top News

Kshatriya Samaj | భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం  

సంఘానికి మైక్ సెట్ బహుకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే

క్షత్రియ సమాజం అభివృద్ధికి కృషి : రాజేందర్ నాథ్ 

తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి : భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే అన్నారు.

శనివారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని భావ్ సార్ క్షత్రియ సమాజ్‌కు రాష్ట్ర అధ్యక్షులు విలువైన మైక్ సెట్‌ను బహుకరించారు. సంఘం భవన ప్రారంభోత్సవం రోజు ఇచ్చిన హామీ మేరకు ఆయనే స్వయంగా మైక్ సెట్‌ను తీసుకొచ్చి సంఘ ప్రతినిధులకు అందజేశారు.

ఐక్యతతో అభివృద్ధి సాధ్యం

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉమేష్ జైతే మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ అభివృద్ధి, యువత ప్రగతి, విద్యా అవకాశాల విస్తరణ కోసం ఎల్లప్పుడూ తమ సహకారం కొనసాగుతుందన్నారు. సమాజం ఐక్యతతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

విద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, యువత సేవా దృక్పథంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘ సభ్యులందరూ ఐకమత్యంతో పనిచేస్తే సమాజ అభ్యున్నతి మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. సమాజ సంక్షేమం కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.


క్షత్రియ సమాజం అభివృద్ధికి కృషి : రాజేందర్ నాథ్ 

ఎల్లారెడ్డి సంఘ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్, DMAC మెంబర్ ఉక్కల్కర్  రాజేందర్ నాథ్ మాట్లాడుతూ క్షత్రియ సమాజం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ సంఘానికి మైక్ సెట్ బహుకరించిన రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంత సంఘ అధ్యక్షుడు కిషోర్ కూడా యువత ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, సమాజ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా నుండి వచ్చిన ప్రతినిధులు నారాయణరావు, ఘనటే సురేష్ కుమార్, హైదరాబాద్ ప్రతినిధి మహేందర్‌కర్ రమేష్, స్థానిక ప్రతినిధులు అమృత్ రావు, అరవింద్, జాడే చంద్ర ప్రకాష్, వి. శ్రీనివాస్ రావు, నాగేష్, గోపాల్ రావు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post