Top News

Praja Vani | ప్రజావాణిలో 80 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రజావాణిలో 80 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు 

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్: 

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 80 దరఖాస్తులను స్వీకరించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, పీడీసీ రవితేజ, డీఆర్వో పాండు, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post