జూలై 31లోపు E-KYC పూర్తి చేయని వారికి ఆగస్టు నుంచి రేషన్ బియ్యం నిలిపివేత
కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఎజాజ్,కౌన్సిలర్ హకీమ్ సూచన
బాన్సువాడ: ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు విధించిన E-KYC ప్రక్రియకు చివరి తేదీ ఈ నెల జూలై 31గా ముగియనుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులందరూ వెంటనే తమకు సమీపంలో ఉన్న రేషన్ షాప్‌కు వెళ్లి కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి E-KYC తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఎజాజ్ ఉద్దీన్, బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ ఏం.ఏ.హకీమ్ కోరారు.
E-KYC విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆగస్టు నెల నుంచి E-KYC పూర్తి చేయని లబ్ధిదారుల పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. దీనితో రేషన్ బియ్యం, ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయని సూచించారు.
చివరి తేదీ దగ్గర పడుతున్నందున ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా E-KYC పూర్తి చేసుకోవాలని నాయకులు బాన్సువాడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق